Viral Video | బైక్‌పై దూసుకెళ్తూ.. రొమాన్స్‌లో మునిగి తేలిన జంట..
Viral Video | ఇతరులకు ఇబ్బంది కలిగించే స్టంట్ చేసి ఆ ప్రేమికులు వార్తల్లో నిలిచారు. ఆ ప్రేమ జంట బైక్‌పై దూసుకెళ్తూ.. రొమాన్స్‌లో మునిగి తేలింది. ఇతరులను పట్టించుకోకుండా ముద్దులతో బిజీగా గడిపారు.
Viral Video | ఓ ఇద్దరు ప్రేమికులు నడిరోడ్డుపై చేసిన స్టంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇతరులకు ఇబ్బంది కలిగించే స్టంట్ చేసి ఆ ప్రేమికులు వార్తల్లో నిలిచారు. ఆ ప్రేమ జంట బైక్‌పై దూసుకెళ్తూ.. రొమాన్స్‌లో మునిగి తేలింది. ఇతరులను పట్టించుకోకుండా ముద్దులతో బిజీగా గడిపారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో వెలుగు చూసింది.
అయితే బైక్‌పై షికారు చేస్తూ.. బహిరంగంగానే ముద్దు పెట్టుకుని, హగ్ చేసుకున్న ఆ జంటపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ రాజస్థాన్ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ప్రియుడు బైక్ నడుపుతుండగా, అతనికి ఎదురుగా యువతి కూర్చుంది. ఇక వారిద్దరూ తమ కోరికలను నియంత్రించుకోలేకపోయారు. ఒకానొక దశలో తన ప్రియుడికి ముద్దు పెట్టి, గట్టిగా హగ్ చేసుకుంది. ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు తన కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. నడిరోడ్డుపై ఆ జంట ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కూడా స్పందించారు. ప్రేమ జంట ప్రయాణించిన బైక్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఆ జంటపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
#Ajmer में बाइक पर लड़की को आगे बैठाकर रोमांस का वीडियो हुआ वायरल, आमजन ने कहा शहर में ऐसी अश्लीलता पर हो कार्यवाही। #Rajasthan @AjmerpoliceR @PoliceRajasthan @RajCMO #अजमेर pic.twitter.com/UtsBbekKAx
— MTTV INDIA (@MTTVINDIA) February 6, 2023
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెచ్చిపోతున్న మందుబాబులు.. గాల్లో దీపంగా అమాయకుల ప్రాణాలు!
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
Vishwak Sen | ప్రీమియర్స్ వేస్తే ‘సైంటిస్టులు’ వచ్చేస్తారు.. పెయిడ్ రివ్యూలపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
Sircilla | పరిహారం పొందిన భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరిట ఎలా?.. ప్రజావాణిలో దేశాయిపల్లి గ్రామస్తుల ఫిర్యాదు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

