పారిపోయిన జంటకు మెడలో టైర్లు వేసి బలవంతంగా డ్యాన్స్

భోపాల్: గ్రామం నుంచి పారిపోయిన ఒక ప్రేమికుల జంటతోపాటు సహకరించిన బాలిక మెడలో టైర్లు వేసి బలవంతంగా డ్యాన్స్ చేయించి శిక్షించారు. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. కుండి గ్రామానికి చెందిన ఒక యువతి, ప్రేమికుడు గోవింద్ జూలై 10న ఊరి నుంచి పారిపోయి గుజరాత్ వెళ్లారు. దీంతో ఆ యువతి కుటుంబం గాంధ్వాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
కాగా, ఆ జంట ఈ నెల 12న గ్రామానికి తిరిగి వచ్చింది. ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆ జంటతోపాటు వారికి సహకరించిన ఒక బాలికను కొట్టారు. అనంతరం వారి మెడలో టైర్లు వేయించి బలవంతంగా డ్యాన్స్ చేయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అయితే యువతి కుటుంబం ఫిర్యాదుతో ప్రేమికుడు గోవింద్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
https://www.facebook.com/watch/?v=1231834867244455
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

