అజయ్ దేవ్గన్ స్టైల్లో కార్లపై స్టంట్… వ్యక్తి అరెస్ట్
లక్నో: సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఒక వ్యక్తి వినూత్నంగా ప్రయత్నించాడు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ మాదిరిగా రెండు కార్లపై స్టంట్ చేశాడు. బైక్ పైనా బిజీ రోడ్డుపై పలు విన్యాసాలు చేశాడు. అతడి వీడియోలు పోలీసుల కంట పడ్డాయి. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఖరీదైన కార్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది.
సొరఖా గ్రామానికి చెందిన 21 ఏళ్ల రాజీవ్ ఇటీవల ఖరీదైన కార్లపై స్టంట్ చేశాడు. హిందీ సినిమా గోల్‌మాల్‌లో నటుడు అజయ్ దేవ్గన్ ఎంట్రీ ఇచ్చిన మాదిరిగా రెండు కార్లపై రెండు కాళ్లు ఉంచి ఫోజులిచ్చాడు. అంతేగాక బిజీ రోడ్డులో బైక్‌పై ప్రమాదకరంగా విన్యాసాలు చేశాడు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.
కాగా, ఈ వీడియోలు పోలీసుల దృష్టికి వెళ్లాయి. దీంతో వాటి ద్వారా రాజీవ్‌ను గుర్తించి ఆదివారం అరెస్ట్ చేశారు. స్టంట్‌కు వినియోగించిన ఖరీదైన రెండు కార్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒక టయోటా ఫార్చ్యూనర్, బైక్ రాజీవ్ కుటుంబానికి చెందినవి కాగా, మరో టయోటా ఫార్చ్యూనర్ అతడి బంధువులది అని పోలీసులు తెలిపారు. సంపన్న కుటుంబానికి చెందిన అతడు ఏ ఉద్యోగం చేయడం లేదని, సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందేందుకు ఇలాంటి వీడియోలు చేస్తుంటాడని వెల్లడించారు.
మరోవైపు ప్రమాదకరంగా స్టంట్లు చేసిన రాజీవ్‌పై చర్యలు తీసుకున్న పోలీసులను గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్ అలోక్ సింగ్ ప్రశంసించారు. పిల్లలు చేసే ప్రమాదకరమైన ఇలాంటి స్టంట్లపై తల్లిదండ్రులు దృష్టిసారించాలని ట్విట్టర్ ద్వారా సూచించారు.
गाड़ियों व बाइक पर खतरनाक स्टंट करने वाले युवक को थाना सेक्टर-113 नोएडा पुलिस द्वारा गिरफ्तार कर स्टंट में प्रयुक्त वाहनों को सीज किया गया।#UPPolice pic.twitter.com/92yYu33O45
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) May 22, 2022
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

