Suryapeta | మద్యానికి బానిసైన కుమారుడు.. కత్తితో నరికి చంపిన తండ్రి
Suryapeta | సూర్యాపేట : మద్యానికి బానిసగా మారిన కుమారుడి ఆగడాలు భరించలేకపోయాడు ఓ తండ్రి. కొడుకు పెట్టే బాధలు భరించలేక.. క్షణికావేశంలో కత్తితో నరికిచంపాడు ఆ తండ్రి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ నగర్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
Suryapeta | సూర్యాపేట : మద్యానికి బానిసగా మారిన కుమారుడి ఆగడాలు భరించలేకపోయాడు ఓ తండ్రి. కొడుకు పెట్టే బాధలు భరించలేక.. క్షణికావేశంలో కత్తితో నరికిచంపాడు ఆ తండ్రి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ నగర్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన చీమల సతీశ్(34) గత కొంతకాలం నుంచి మద్యానికి బానిసగా మారాడు. ఇక మద్యం సేవించి వచ్చి.. నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడు. ఇబ్బందులు పెడుతూ, వారిని హింసించేవాడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సతీశ్ మద్యం తాగి ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుని, దాడి చేశాడు. దీంతో తండ్రి లింగయ్య ఇంట్లో ఉన్న రోకలిబండతో సతీశ్ తలపై బాదడంతో కిందపడిపోయాడు. అంతటితో ఆగకుండా మటన్ కొట్టే కత్తితో తల, కుడి చేయి, ఎడమ కాలుపై విచక్షణారహితంగా నరికి చంపాడు. తీవ్ర రక్తస్రావంతో సతీశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తల్లి లింగమ్మ ఫిర్యాదు మేరకు సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ జి.రాజశేఖర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సతీశ్‌కు వివాహం కాగా, భార్య వదిలేసి వెళ్లినట్లు సమాచారం.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ‘దివికి దివికి’ ప్రోమో విడుదల!
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

