Siddipeta | సిద్దిపేట : సిద్దిపేట శివారులో ఉన్న ఏఆర్ హెడ్ క్వార్టర్స్( AR Head Quarters )లో తుపాకీ మిస్ ఫైర్( Gun Miss fire ) అయింది. తుపాకులను శుభ్రం చేస్తుండగా, ఓ తుపాకీ పేలింది. దీంతో కానిస్టేబుల్ రాజశేఖర్( Constable Rajashekar ) కుడి కంటికి తీవ్ర గాయమైంది.
అప్రమత్తమైన మిగతా పోలీసులు.. రాజశేఖర్‌ను చికిత్స నిమిత్తం హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి( Siddipeta Govt Hospital ) తరలించారు. రాజశేఖర్ కంటికి డాక్టర్లు చికిత్స అందించారు. కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.