Food | కావలసిన పదార్థాలు
ఎర్ర గుమ్మడి తురుము: ఒక కప్పు, నెయ్యి: పావు కప్పు, పాలు: అర కప్పు, చక్కెర: అర కప్పు, యాలకుల పొడి: చిటికెడు, తరిగిన బాదం, కాజు: పావు కప్పు
తయారీ విధానం
స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, బాగా వేడయ్యాక గుమ్మడి తురుము జోడించాలి. దాన్ని సన్నటి మంటపై దాదాపు ఐదు నిమిషాలపాటు వేయించాలి. వేగిన గుమ్మడి మిశ్రమంలో పాలు పోసి మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. చక్కెర, యాలకుల పొడి కలుపుతూ దగ్గర పడనివ్వాలి. స్టవ్ మీద మరోపాన్ పెట్టుకుని మిగతా నెయ్యి వేసి కాజు, బాదం వేయించి నెయ్యితో సహా గుమ్మడి మిశ్రమంలో వేయాలి. నెయ్యి పైకి తేలే వరకు వేయించి దించుకుంటే కమ్మని గుమ్మడి హల్వా సిద్ధం.