యశ్‌రాజ్ ఫిల్మ్స్ ‘బేపర్వా’
ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న తాజా రొమాంటిక్ యాక్షన్ డ్రామాకు ‘బేపర్వా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అహాన్ పాండే, షర్వరీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న తాజా రొమాంటిక్ యాక్షన్ డ్రామాకు ‘బేపర్వా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అహాన్ పాండే, షర్వరీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఫియర్లెస్ ఇన్ లవ్’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. వచ్చే ఏడాది మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
‘సైయారా’చిత్రంతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అహాన్ పాండే ఈ సినిమాతో కెరీర్లో మరో భారీ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారు. ప్రేమ, సంగీతం, యాక్షన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది. దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌కు యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో ఇది ఐదో సినిమా. గతంలో ఆయన ఈ సంస్థలో మేరే బ్రదర్ కీ దుల్హన్, గుండే, సుల్తాన్, టైగర్ జిందా హై వంటి చిత్రాలను తెరకెక్కించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

