Bigg Boss | బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా విన్నర్ కాలేదు. ఫస్ట్ సీజన్ నుంచి ఆరో సీజన్ వరకు అంతా అబ్బాయిలే కప్ ఎత్తుకుంటున్నారు. ఓటీటీ వర్షన్లో మాత్రం బిందు మాధవి విజేతగా నిలిచింది కానీ ఆ వర్షన్ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. టీవీలో వచ్చే బిగ్ బాస్‌కు మాత్రమే చాలా క్రేజ్ ఉంది. అందులో ఇప్పటి వరకు అమ్మాయిలు గెలవలేదు. ప్రతీ సీజన్లోనూ అమ్మాయిలు రావడం.. వెళ్లిపోవడం జరుగుతుంది కానీ ఒక్కసారి కూడా కప్ ఎత్తింది లేదు. మధ్యలో శ్రీముఖి, అరియానా లాంటి వాళ్లు కచ్చితంగా కప్ గెలుస్తారేమో అనేంత దగ్గరగా వచ్చారు కానీ అబ్బాయిల ముందు తగ్గక తప్పలేదు. పైగా వచ్చిన ప్రతీ అమ్మాయి లక్ష్యం కూడా బిగ్ బాస్ కప్పు గెలవడమే. ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదు.. ఈ సారి కచ్చితంగా గెలిచి చూపిస్తామంటూ వాళ్లు చెప్పడం.. అక్కడ మాత్రం సీన్ రివర్స్‌లో జరగడం కామన్ అయిపోయింది.
సీజన్ 7లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే సీజన్ చివరి దశకు వచ్చేసింది. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ 7 ముగింపు పలకనున్నారు. హౌజ్‌లో టాప్ 6 కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో ఇప్పటికే ప్రియాంక, యావర్, అమర్, అర్జున్ ఫైనల్‌కు చేరుకున్నారు. మరో ఫైనలిస్ట్ ప్లేస్ కోసం శివాజీ, ప్రశాంత్ మధ్య పోటీ నడుస్తుంది. ఇందులో ప్రశాంత్ బయటిక వచ్చేసి.. శివాజీ ఫినాలేకు వెళ్లేలా కనిపిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సారైనా అమ్మాయిలు గెలుస్తారేమో అనుకుంటే.. అది జరిగేలా కనిపించడం లేదు. ట్రెండ్స్ ప్రకారం ఈ సారి కూడా టైటిల్ కచ్చితంగా అబ్బాయిలు గెలుస్తారని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా శోభా శెట్టిపై ముందు నుంచి అంచనాలు బాగానే ఉండేవి. కానీ చివరి రెండు వారాలుగా ఆమె చేసిన ఓవర్ యాక్షన్ కారణంగానే బయటికి వచ్చేసిందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయిప్పుడు. ముఖ్యంగా తను డిస్టర్బ్ అవ్వడమే కాదు.. ఇంట్లో అందర్నీ డిస్టర్బ్ చేసింది ఈ భామ.
అందుకే శోభా శెట్టిని ఫైనల్ కంటే ముందుగానే ఇంటికి పంపించారు ఆడియన్స్. ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే మాత్రం కచ్చితంగా అమర్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అర్జున్ గ్రాఫ్ కూడా చాలా బాగా ఉంది కానీ మొదటి 5 వారాలు ఆయన ఇంట్లో లేడు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే ఒక్క కారణంతోనే విన్నర్ చైర్‌కు దూరంగా ఉండిపోతున్నాడు. మిగిలిన వాళ్లలో యావర్, శివాజీ, ప్రశాంత్, ప్రియాంక అంతా ఫినాలేతోనే సరిపట్టుకుంటున్నారు. ఇదే గానీ జరిగితే మరోసారి అమ్మాయిలకు బిగ్ బాస్ హ్యాండిచ్చినట్లే. ఏదేమైనా మరో రెండు వారాల్లో విన్నర్ ఎవరో.. రన్నర్ ఎవరో తేలిపోనుంది.