హీరో సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్ విడుదల
రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్ రిలీజ్ కానుంది.
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్ రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‌ను గమనిస్తే.. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, హీరో, హీరోయిన్స్ ఎనర్జీ, ఇలా ఈతరం ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారిని అలరించే ఫుల్ ప్యాకేజీగా ఈ చిత్రాన్ని రూపొందించారని అర్థమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ” ట్రైలర్ విడుదలైన కొద్ది సమయంలోనే మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ చూసిన వారు ఈచిత్రం షూర్ షాట్ విజయం అంటుంటే ఆనందంగా ఉంది.
క్యూట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రత సన్నివేశం ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంది. హీరో సుహాస్, మాళవిక మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా అలరించే విధంగా ఉంటాయి. సుహాస్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం అందరికి కొత్త అనుభూతినిస్తుంది. జూలై 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. పూర్తి ఎంటర్టైనింగ్గా రాబోతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మీ హృదయాలను దోచుకుంటుంది.
తప్పకుండా నిర్మాతగా ఓ మంచి సినిమాను ఇవ్వబోతున్నాం అనే నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ప్రతి ప్రమోషన్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ క్వాలిటీ సినిమాను ప్రేక్షకులకు ఇవ్వడానికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత హరీష్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించాడు. ప్రొడక్ట్ క్వాలిటీగా రావడానికి ఆయనే కారణం. మణికందన్ ఫోటోగ్రఫీతో ఈ సినిమాను చాలా కలర్ఫుల్గా మలిచాడు.రథన్ ఈ లవ్‌స్టోరీకి చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో ఉన్న ఆరుపాటలు వేటికవే అనే విధంగా బ్యూటిఫుల్‌గా ఉంటాయి అన్నారు.
ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. మణికందన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి రథన్ సంగీతాన్నిసమాకూరుస్తున్నాడు. బ్రహ్మా కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) హైదరాబాద్ జోన్ పరిధిలో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మొత్తం 63 మంది ఉద్యోగులకు వివిధ ఉన్నత హోదాల్లో పదోన్నతులు కల్పిస్తూ హైదరాబాద్ జోన్ ఈడీ ఖుశ్రో షా ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. .జూనియర్ క్లర్క్ ( ఫైనాన్స్)గా పదోన్నతి పొందిన వారిలో 23 మంది కండక్టర్లు, ముగ్గురు డ్రైవర్లు, ఇద్దరు ఆఫీసర్లు (RCs), . జూనియర్ అసిస్టెంట్ (పర్సనల్)గా 27 మంది కండక్టర్లు పదోన్నతి పొందారని వివరించారు.
‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
Anil Byreddy | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం: అనిల్ బైరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

