Gaami | టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గామి’ (Gaami). చాందిని చౌదరి కథానాయిక నటిస్తున్న ఈ సినిమాకు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహిస్తున్నాడు. క్రౌడ్ ఫండింగ్‌లో భాగంగా చేసిన ఈ సినిమాకు కార్తీక్ శబరీష్ నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గామి టీజర్ వీడియో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి గమ్యాన్నే.. ది క్వెస్ట్ సాంగ్ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. సొమ్మసిల్లిపోయి కూలింది కాలం.. సత్తువంతు లేక ఇంకెంత కాలం.. సన్నగిల్లకుంది ఈ వింత దూరం దిక్కుతోచకుండా ఇంకెంత దూరం అంటూ సాగిన ఈ పాట ఫుల్ ఎమోషనల్‌గా సాగింది. సనపతి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించిన ఈ పాటకు అనురాగ్ కులకర్ణి, స్వీకర్ అగస్తి & సుగుణమ్మ కలిసి పాడరు. స్వీకర్ అగస్తీ సంగీతం అందించాడు.
మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న అఘోర శంకర్ (విశ్వక్ సేన్) హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్రం. ఇక ఈ సినిమాను మార్చి 08న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అభినయ, మహ్మద్ సమద్, హారిక పెడద, దయానంద్ రెడ్డి, శాంతి రావు, మయాంక్ పరాఖ్, జాన్ కొట్టోలీ, బొమ్మ శ్రీధర్, రజనీష్ శర్మ, శరత్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.