బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ల తలరాతలే మారిపోతున్నాయి. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఇళ్లు లేదంటే ఖరీదైన కార్లు కొనడం కామన్‌గా మారింది. బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన చాలా మంది కంటెస్టెంట్స్ తమ కలలను నెరవేర్చుకుంటున్నారు.
బిగ్ బాస్‌లో పాల్గొన్న హిమజా, సోహెల్, అఖిల్, అరియానా, శివజ్యోతి, శ్రీముఖి కొత్త కార్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలోకి విశ్వ కూడా వచ్చి చేరాడు. నిజానికి విశ్వ హౌజ్‌లో నుంచి త్వరగానే ఎలిమినేట్ అయిన మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.
తాజాగా విశ్వ బీఎండబ్ల్యూ కారును కొనేశాడు. దీంతో ఇంత లగ్జరీ కారును కొనేయడంతో అంతా షాక్ అవుతున్నారు. మనం కలలు కన్న కారును కొంటే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు నేను అదే ఫీలింగ్‌లో ఉన్నా.. మా కుటుంబంలోకి కొత్త మెంబర్ వచ్చింది.. దీనంతటికి కారణం ఆ దేవుడు, బిగ్ బాస్ అంటూ విశ్వ ఎమోషనల్ అయ్యాడు.