Vijayakanth | ‘నన్ను క్షమించు అన్నయ్య’.. నీ చివరి చూపు చూడలేకపోతున్నా : విశాల్
Vijayakanth | తమిళ నటుడు, డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రావిడ కలగం) అధినేత కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) కన్నుమూసిన విషయం తెలిసిందే. శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరగా.. కొవిడ్ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా.. విజయకాంత్ తుదిశ్వాస విడిచారు.
Vijayakanth | తమిళ నటుడు, డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రావిడ కలగం) అధినేత కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) కన్నుమూసిన విషయం తెలిసిందే. శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరగా.. కొవిడ్ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా.. విజయకాంత్ తుదిశ్వాస విడిచారు. నటుడిగా, రాజకీయవేత్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయ్ కాంత్ మృతి పట్ల యావత్ తమిళ ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులంతా ఆయన మృతిపై సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా న్యూయార్క్‌లో ఉన్న కోలీవుడ్ హీరో విశాల్ కూడా విజయ్ కాంత్ మృతిపై సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ పెట్టాడు.
”నన్ను క్షమించండి అన్నయ్య. ఈసారి నేను మీ పక్కన ఉండాల్సింది. ఇలా జరుగుతుందని నాకు తెలియదు, న్యూయార్క్‌కు వచ్చి ఉండకుడదు అంటూ విశాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అన్నయ్య సమాజసేవ అనేది నేను నిన్ను చూసే నేర్చుకున్నా. మీ మరణవార్త విని నా కాళ్లు, చేతులు పని చేయడం లేదు. కెప్టెన్ ను కోల్పోవడం బాధగా ఉంది. నన్ను క్షమించు అన్నయ్య.. నీ చివరి చూపు చూడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందంటూ” విశాల్ చెప్పుకోచ్చాడు.
I have nothing to say as I feel guilty that am not there physically present after hearing the demise of one of the most noblest human beings I hav met in my life the one and only #CaptainVijaykanth anna. I learnt what is called social service from you and follow you till date and… pic.twitter.com/pMYAblLOdV
— Vishal (@VishalKOfficial) December 28, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

