Pawan Kalyan | స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్.. ముచ్చటగా మూడో సినిమా సెట్స్‌పైకి..!
గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తు అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఇటీవలే రెండు సినిమాలను అనౌన్స్ చేసిన పవన్.. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
Vinodaya sitham Remake | పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. మరో వైపు వరుసగా సినిమాలు సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 17వ శతాబ్ధం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా సెట్స్‌పైన ఉండగానే పవన్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను ప్రకటించాడు.
హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్‌ను, సుజీత్‌తో గ్యాంగ్‌స్టర్ డ్రామాను అనౌన్స్ చేశాడు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఇక పవన్ ఈ సినిమా షూటింగ్‌లను ఏకకాలంలో జరుపనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పవన్ మరో సినిమాను పట్టాలెక్కించేదుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం రీమేక్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్ళనున్నట్లు తెలుస్తుంది. కాగా గతంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సిఉంది. కానీ కొన్ని కారణాలతో పోస్ట్ పోన్ అయింది. దాంతో ఈ సినిమా కాన్సిల్ అయినట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు పవన్ సిద్ధమయ్యాడట. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖని రీమేక్ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించనున్నట్లు టాక్.
ఈ ప్రాజెక్ట్‌లో సాయిధరమ్ తేజ్ కూడా భాగమవుతున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అంతేకాకుండా యాక్సడెంట్ నుండి కోలుకున్నాక.. సాయి ధరమ్ తేజ్ మొదట కాలుపెట్టేది ఈ సెట్లోనే అని టాక్ కూడా వినిపించింది. ఇక ఇప్పుడు సాయి తేజ్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. మరీ ఈ బిజీ టైమ్‌లో మామ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటాడో లేదో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథా మాటలు అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

