Dhruva Natchathiram | అగ్రెసివ్‌గా స్టైలిష్ లుక్‌లో విక్రమ్.. క్యూరియాసిటీ పెంచుతోన్న ధ్రువ నక్షత్రం తాజా పోస్టర్
Dhruva Natchathiram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram). జాగా రిలీజ్ డేట్‌ను గుర్తు చేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) డైరెక్ట్ చేస్తున్నాడు.
Dhruva Natchathiram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram). గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) డైరెక్ట్ చేస్తున్నాడు. పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ విడుదల చేసిన తమిళ, తెలుగు ట్రైలర్స్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా రిలీజ్ డేట్‌ను గుర్తు చేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
మెడలో స్కార్ప్, స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ వేసుకున్న విక్రమ్ చేతిలో పిస్తోల్ పట్టుకొని అగ్రెసివ్‌గా కనిపిస్తున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ మరో 8 రోజుల్లో మీ కోసం.. సిద్దంగా ఉండండి.. అంటూ లాంఛ్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ముంబై దాడులు జరిగినప్పుడు అక్కడికి ఎన్ఎస్జీ హెలికాప్టర్ రావడం బాగా ఆలస్యమైంది.. అంటూ సాగే డైలాగ్స్‌తో మొదలైన ధ్రువ నక్షత్రం ట్రైలర్.. సినిమా అతి ముఖ్యమైన మిషన్ నేపథ్యంలో సాగనున్నట్టు హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రంలో ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికా ఇతర నటీనటులు కీ రోల్స్ పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
ఈ చిత్రాన్ని ఒండ్రగ ఎంటర్టైన్మెంట్, కొండదువోం ఎంటర్టైన్మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. యాక్షన్ స్పై జోనర్లో వస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ జాన్/ధ్రువ్ పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ మూవీ నుంచి ఇటీవలే కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. ధ్రువ నక్షత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేయనుంది.
ధ్రువ నక్షత్రం తాజా పోస్టర్..
A Pulsating Tale packed with High-Octane Action.
Meet at the Basement in 8 Days 💥 #DhruvaNatchathiramFromNov24 #DhruvaNakshathramFromNov24 #DhruvaNatchathiram #DhruvaNakshathram@chiyaan @menongautham @Jharrisjayaraj @riturv @OndragaEnt @Preethisrivijay @SonyMusicSouth… pic.twitter.com/pZcQLam0xs
— Oruoorileoru Film House (@oruoorileoru) November 16, 2023
ధ్రువ నక్షత్రం తెలుగు ట్రైలర్..
ధ్రువ నక్షత్రం తమిళ్ ట్రైలర్..
ధ్రువ నక్షత్రం టీజర్ ..
కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

