యూనివర్సల్ టైటిల్స్పై ఆసక్తి చూపుతున్న దళపతి

దళపతి విజయ్ ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేవాడు. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈయన కథల ఎంపిక మాత్రమే కాదు.. టైటిల్స్ విషయంలోనూ ఇదే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు . అన్ని భాషలకు ఒకేలా ఉండేలా కామన్ టైటిల్స్ వైపు అడుగులు వేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఇదే చేస్తున్నాడు విజయ్. ఒక్కో భాషకు ఒక్కో టైటిల్ పెట్టేకంటే కూడా కథ మాదిరే టైటిల్ కూడా యూనివర్సల్ ఉండాలని కోరుకుంటున్నాడు. జూన్ 22న ఈయన పుట్టిన రోజు సందర్భంగా బీస్ట్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ సినిమాకు కూడా అన్ని భాషలకు కలిపి ఒకే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. మాస్టర్ సినిమా మాదిరే బీస్ట్ కూడా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళంలో విడుదల కానుంది. మరి విజయ్ అలా యూనివర్సల్ టైటిల్స్ తో చేసిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..
- బీస్ట్: దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్
- మాస్టర్: దర్శకుడు లోకేష్ కనకరాజ్
- సర్కార్: దర్శకుడు మురుగదాస్
- భైరవ: దర్శకుడు భరతన్
- జిల్లా: దర్శకుడు ఆర్టీ నీసన్
- పులి: దర్శకుడు చింబు దేవన్
- కత్తి: దర్శకుడు మురుగదాస్
- తుపాకి: దర్శకుడు మురుగదాస్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

