Vijay Deverakonda | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు వున్నాయి. ఇందులో దిల్ రాజు నిర్మాణంలో రెండు సినిమాలు చేస్తున్నారు. పరశురాం దర్శకత్వంలో ఒక సినిమా, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమా. ఈ రెండిటిని దిల్ రాజే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రవికిరణ్ చేయబోతున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో వుంది.
తాజాగా రవికిరణ్ తో చేస్తున్న చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ తెలిసింది. ఈ చిత్రానికి ‘యుద్ధం’ (Yuddham) అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని సమాచారం. 1980 మాఫియా నేపధ్యంలో సాగే చిత్రానికి ఓ పవర్ ఫుల్ టైటిల్ కోసం అన్వేషిస్తున్న మేకర్స్.. యుద్ధం టైటిల్ ని లాక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ మునుపెన్నడూ లేని యాక్షన్ అవతార్ లో కనిపించబోతున్నారు.
ఇక విజయ్ చేస్తున్న మూడో సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోంది. యాక్షన్ ప్రధానంగా సాగే స్పై థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా రెండు పార్ట్ లు గా ఉండబోతుంది. నాగవంశీ నిర్మించబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.