Vijay Devarakonda | క్రికెట్ బాగా ఆడతాను, సపోర్ట్ చేయి అన్న అని వేడుకున్న అభిమాని.. నేను తోడుంటానంటూ విజయ్ భరోసా
Vijay Devarakonda | టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసుతో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ తనను అభిమానించే వారి పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయతతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటనతో మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.
Vijay Devarakonda | టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసుతో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ తనను అభిమానించే వారి పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయతతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటనతో మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక టీజీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ టోర్నమెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విజయ్ స్టేడియానికి చేరుకోగానే అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు, కలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు.
అయితే ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సంఘటన అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. స్టేడియంలో ఉన్న ఓ యువ అభిమాని విజయ్ దేవరకొండను చూడగానే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆవేశాన్ని ఆపుకోలేక ఆయన దగ్గరకు వెళ్లి, “అన్నా… నేను చాలా బాగా క్రికెట్ ఆడతాను. కానీ నాకు సరైన అవకాశాలు, ప్రోత్సాహం లేవు. నువ్వు నాకు కొంచెం సపోర్ట్ చేయాలి అన్నా” అంటూ వేడుకున్నాడు. ఆ పరిస్థితిని గమనించిన విజయ్ దేవరకొండ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ యువకుడి వద్దకు వెళ్లి అతన్ని గుండెలకు హత్తుకుని ఓదార్చారు. అనంతరం అతనితో కొంతసేపు మాట్లాడి, వ్యక్తిగత వివరాలు, కుటుంబ పరిస్థితులు తెలుసుకున్నారు. క్రికెట్లో ఎదగాలనే అతని కలను గౌరవిస్తూ, తనవంతు సహాయం అందిస్తానని, భవిష్యత్తులో అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు అక్కడున్న వారు తెలిపారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల్లో మాత్రమే కాదు.. నిజ జీవితంలోనూ విజయ్ దేవరకొండ రియల్ హీరో , అభిమానుల భావోద్వేగాలను అర్థం చేసుకునే స్టార్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ సామాజిక సేవలో కూడా ఎప్పుడూ ముందుంటారు. ప్రతి ఏడాది ‘దేవరశాంటా’ కార్యక్రమం ద్వారా అభిమానులకు విహారయాత్రలు, బహుమతులు అందిస్తూ వారితో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే విద్య కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహాయం చేయడం, అవసరమైన చోట సేవా కార్యక్రమాలు నిర్వహించడం వంటి ఎన్నో కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ వస్తున్నారు.
అతనికి ఈరోజు కడుపు నిండిపోయి ఉంటుంది…
ఒక ఫ్యాన్ కోసం అంత టైమ్ కేటాయించి…చెప్పింది పూర్తిగా విని…
Nice Gesture #VijayDevarakonda 👏#TG20 finale pic.twitter.com/ya64q0D8r6— Taraq(Tarak Ram) (@tarakviews) July 12, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

