Vetrimaaran | నోట్ల రద్దు కష్టాలు అప్పుడే మర్చిపోయారా?.. ‘ధురంధర్ 2’ ప్రోపగండా అంటూ వెట్రిమారన్ విమర్శలు
Vetrimaaran | తమిళ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ 'ధురంధర్ 2' (Dhurandhar 2) సినిమాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Vetrimaaran | తమిళ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) సినిమాపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వెట్రిమారన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, నేటి సినిమాల్లో పెరిగిపోతున్న రాజకీయ ‘ప్రచార’ (Propaganda) ధోరణిపై గళమెత్తారు. అధికార పార్టీ సినిమాలను చరిత్రను వక్రీకరించడానికి మరియు ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడానికి వాడుకుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ప్రతిదీ ఒక ప్రచారంగా మారిపోయింది. మన జ్ఞాపకాలను, ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఈ ప్రచారానికి ఉంది. 2016లో నోట్ల రద్దు (Demonetization) వల్ల ఎవరు నష్టపోయారో, క్యూ లైన్లలో నిలబడి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాటన్నింటినీ మరుగున పడేసి, ద్వేషాన్ని పెంచేలా ప్రచారం చేస్తున్నారు. చరిత్రను లేదా వాస్తవాలను వక్రీకరించి చూపడం ‘హేట్ ప్రొపగండా’ (Hate Propaganda) కిందకే వస్తుందని ఆయన ఘాటుగా విమర్శించారు.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. అయితే, ఈ సినిమాలో 2016 నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ, అది పాకిస్థాన్ నుంచి వచ్చే దొంగ నోట్లను అరికట్టడానికి అధికార పార్టీ చేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ లాగా చూపించారు.
కానీ వాస్తవానికి జరిగింది ఏమిటంటే.. నోట్ల రద్దు తర్వాత పాత నోట్లను మార్చుకోవడానికి మరియు కొత్త నోట్లను విత్‌డ్రా చేసుకోవడానికి ప్రజలు గంటల తరబడి, కొన్నిసార్లు రోజంతా క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చింది. ఎండలో నిలబడి నీరసించి, గుండెపోటుతో లేదా అలసటతో దేశవ్యాప్తంగా సుమారు 100 నుంచి 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అప్పట్లో నివేదికలు వచ్చాయి. అంతేగాకుండా భారతదేశంలో చిన్న వ్యాపారాలు, రోజువారీ కూలీలు పూర్తిగా నగదుపైనే ఆధారపడతారు. నగదు లేకపోవడంతో వ్యాపారాలు మూతపడ్డాయి, కూలీలకు పని దొరకలేదు. రైతులు తమ పంటను అమ్ముకోలేక, విత్తనాలు కొనలేక తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇదే విషయాన్ని వెట్రిమారన్ ప్రస్తావిస్తూ.. సినిమాల్లో నోట్ల రద్దును ఒక గొప్ప విజయంగా చూపిస్తున్నప్పుడు, పైన పేర్కొన్న సామాన్యుల కష్టాలను ఆ సమయంలో జరిగిన ప్రాణనష్టాన్ని విస్మరించడం ‘ప్రొపగండా’ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
#Vetrimaaran indirectly attacks #Dhurandhar2:
“Today everything becomes propoganda. Propoganda has power to influence memory. We all know who has impacted with demonetization & how many Lost lives in standing the queue. It’s hate propoganda”pic.twitter.com/kdQgYobUCN
— AmuthaBharathi (@CinemaWithAB) March 28, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

