వెంకటేష్‌కి బుల్లితెర ఆఫర్స్.. నో చెప్పడానికి కారణం?

వెండితెరపై అద్భుతాలు సృష్టిస్తున్న స్టార్స్ ఇప్పుడు బుల్లితెరపై సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే నాగార్జున,చిరంజీవి,ఎన్టీఆర్ , సమంత, ఆలీ, బ్రహ్మానందం,సాయి కుమార్, సమంత, తమన్నా, మంచు లక్ష్మీ వంటి స్టార్స్ టీవీ హోస్టింగ్లతో సత్తా చాటుతున్నారు. వీళ్లందరి కంటే ముందు విక్టరీ వెంకటేష్ కి బుల్లితెర హోస్టింగ్ చేయమని ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన అంగీకరించలేదు
సినిమాని మంచి ఆయనకు పారితోషికం ఇస్తామని ఓ ఛానెల్ వెంకీని సంప్రదించిందట. మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ -2కి సంబంధించి హోస్ట్ గా వెంకీనే తీసుకోవాలనుకున్నారు. కానీ ఆయన సున్నితంగా ఆఫర్ ని తిరస్కరించారు. అటుపై బిగ్ బాస్ లో ఏదైనా సీజన్ కి హోస్ట్ గా తీసుకోవాలని నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేసారు. కానీ అది వర్కౌట్ కాలేదు. మాస్టర్ చెఫ్ కూడా వెంకీ చేతికే ముందు వెళ్లిందట.
వెంకీకి బుల్లితెర ఆఫర్స్ వద్దన్నా వస్తున్నాయి. ఆయన వాటిని తృణప్రాయంగా వదులుకున్నారు. చిరంజీవి లాంటి స్టార్ హీరోలు బుల్లితెరపై సందడికి సిద్ధం కాగా, వెంకటేష్ వదులుకోవడానికి కారణం ఏంటన్నది మిస్టరీగా మారింది. ఇటీవలి కాలంలో వెంకీ ఆధ్యాత్మిక చింతనతో సినిమాల విషయంలోను కాస్త ఆచితూచి అడుగులేస్తున్నారు. సమయం లేకనే వెంకీ బుల్లితెరకు నో అంటున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- narappa
- small screen
- Venkatesh
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

