Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి ‘U/A’ సర్టిఫికేట్ లభించింది. అంతేగాకుండా ఈ సినిమా తమిళ్ సినిమా ‘బ్లాస్ట్’కి ఎలాంటి సంబంధం లేదని నటి శ్రీనిధి శెట్టి స్పష్టం చేశారు.
ఇక సినిమా విడుదలకు రంగం సిద్ధం కావడంతో, మేకర్స్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, శిల్పకళా వేదిక వేదికగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. శ్రేయాస్ గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేతా థామస్, డింపుల్ హయతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ భారీ చిత్రం అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

