Bro | మొన్న చిరంజీవి.. నేడు పవన్ కల్యాణ్.. బ్రో క్రేజీ అప్డేట్
Bro | మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ సాంగ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా. తాజాగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తోన్న సినిమాల్లో బ్రో (Bro The Avatar) కూడా ప్రత్యేక గీతంలో కనిపించబోతున్నట్టు ఇప్పటికే అప్డేట్ తెరపైకి వచ్చింది.
Bro | మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ సాంగ్‌తో ఈ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసింది బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా. ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలిచిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ డ్యాన్సింగ్ క్వీన్ ఇప్పటికే RAPO20లో స్పెషల్ సాంగ్ చేస్తోంది. తాజాగా సముద్రఖని (Samuthirakani) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తోన్న సినిమా బ్రో (Bro The Avatar)లో కూడా ప్రత్యేక గీతంలో కనిపించబోతున్నట్టు ఇప్పటికే అప్డేట్ తెరపైకి వచ్చింది.
తాజా టాక్ ప్రకారం పవన్ కల్యాణ్ ఇవాళ బ్రో షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. అంతేకాదు త్వరలోనే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej), ఊర్వశి రౌటేలా కాంబోలో వచ్చే స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. గణేశ్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేయబోతున్నాడు. బ్రో చిత్రంలో బ్రహ్మానందం, సుబ్బరాజు, రోహిణి ముల్లేటి, తనికెళ్లభరణి, రాజా చెంబోలు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవలే బ్రో డబ్బింగ్ పనులు కూడా మొదలైన విషయం తెలిసిందే. వినోదయ సీతమ్ రీమేక్ (Vinodaya Sitham Remake)గా వస్తున్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

