Suma | సుమపై త్రివిక్రమ్ వరుస పంచ్‌లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవ్వులు పూయించిన మాటల మాంత్రికుడు!
Suma | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన సంభాషణలతో వెండితెరపై ప్రేక్షకులను అలరించే ఆయన.. వేదికలపై కూడా చమత్కారమైన మాటలతో నవ్వులు పూయిస్తుంటారు. సందర్భానికి తగ్గట్టుగా పంచ్‌లు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా యాంకర్ సుమ కనకాలతో జరిగిన సరదా సంభాషణలోనూ త్రివిక్రమ్ తనదైన శైలిలో అదరగొట్టారు. ఆయన వేసిన వరుస కౌంటర్లతో ఈవెంట్లో నవ్వులు వెల్లివిరిశాయి.
Suma | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన సంభాషణలతో వెండితెరపై ప్రేక్షకులను అలరించే ఆయన.. వేదికలపై కూడా చమత్కారమైన మాటలతో నవ్వులు పూయిస్తుంటారు. సందర్భానికి తగ్గట్టుగా పంచ్‌లు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా యాంకర్ సుమ కనకాలతో జరిగిన సరదా సంభాషణలోనూ త్రివిక్రమ్ తనదైన శైలిలో అదరగొట్టారు. ఆయన వేసిన వరుస కౌంటర్లతో ఈవెంట్లో నవ్వులు వెల్లివిరిశాయి. వెంకటేశ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’. ఈ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా ట్రైలర్ చూసి స్ఫూర్తి పొంది త్రివిక్రమ్ శైలిలో ఓ చిన్న కవిత్వం చెప్పి సుమ అందరినీ ఆకట్టుకున్నారు. “త్రివిక్రమ్ సినిమాలంటే ఒక వరం.. ఆ సినిమాలు ఆలస్యమైతే వస్తుంది జ్వరం.. ఈరోజు ఈ కార్యక్రమంలో మాట్లాడాలని ఆరాటపడుతోంది నా స్వరం” అంటూ ఆమె ప్రాసలతో మాట్లాడారు. దీనికి వెంటనే స్పందించిన త్రివిక్రమ్.. “మీరు ఇవాళ వేసుకోకుండా వచ్చారు సవరం” అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చారు. దీంతో వేదికపై నవ్వులు మొదలయ్యాయి. సుమ కూడా ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో స్పందించారు. ఆ తర్వాత సుమ.. “ఈ ఒక్క మాటతో నేను రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని టీజర్ వేయడానికి వెళ్తున్నాను” అంటూ త్రివిక్రమ్ సినిమాల్లోని సంభాషణల శైలిని అనుకరించారు. వెంటనే మాటల మాంత్రికుడు మరో పంచ్ వేశారు. “చీరకు ఆ జేబులు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు మాకు ఆ వివరం” అంటూ చమత్కరించారు.
త్రివిక్రమ్ మాటలకు సుమ కూడా నవ్వుతూ స్పందించారు. ఆయన వేసిన పంచ్ అర్థం తెలుసుకున్న తర్వాత.. “అందుకే సార్ మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను” అని అన్నారు. దీనికి త్రివిక్రమ్ మరోసారి తనదైన శైలిలో బదులిచ్చారు. “మేము ఇక్కడ కింద ఉన్నాం.. మాకు అందనంత ఎత్తులో మీరు అక్కడ ఉన్నారు” అంటూ సుమను ఉద్దేశించి చమత్కరించారు. దీంతో వేదికపై నవ్వులు మరింత పెరిగాయి. చివరకు సుమ టీజర్ ప్రదర్శనకు వెళ్తున్నానంటూ సరదాగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వేడుకలో త్రివిక్రమ్, సుమ మధ్య జరిగిన మాటల యుద్ధం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సినిమాల్లో పంచ్ డైలాగులతో ఆకట్టుకునే త్రివిక్రమ్.. నిజ జీవితంలోనూ తన చమత్కారంతో నవ్వులు పూయిస్తారని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా, త్రివిక్రమ్ పంచ్‌లపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suma | సుమపై త్రివిక్రమ్ వరుస పంచ్‌లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవ్వులు పూయించిన మాటల మాంత్రికుడు!
RC 17 | రామ్ చరణ్-సుకుమార్ ‘ఆర్సీ17’లో విజయ్ సేతుపతి.. కీలక పాత్రపై ఆసక్తికర ప్రచారం!
Ramagundam CP | అర్ధరాత్రి వేళ బైక్‌పై సీపీ పెట్రోలింగ్.. మంచిర్యాలలో ఆకస్మిక తనిఖీలు
Nivetha Pethuraj | ‘ఆదర్శ కుటుంబం’ కథ మొత్తం తెలియదన్న నివేదా పేతురాజ్.. ట్రోలింగ్ ఎదుర్కొంటున్న బ్యూటీ
Donald Trump | ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

