Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
Trisha | తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష పేరు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయ ప్రస్థానం, తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే త్రిషకు సంబంధించి కోలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.
Trisha | తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష పేరు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయ ప్రస్థానం, తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే త్రిషకు సంబంధించి కోలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత పాత్రలో త్రిష నటించబోతున్నారనే ప్రచారం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. లెజెండరీ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ జీవితకథ ఆధారంగా ‘పురచ్చి తలైవర్ ఎంజీఆర్’ పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కనుంది. ఎంజీఆర్ సినీ ప్రయాణం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.
ఈ కథలో జయలలిత పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉండనుంది. ఎంజీఆర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన జయలలిత.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ముఖ్యమంత్రిగా కూడా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత పాత్రకు త్రిషను ఎంపిక చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర కోసం ఆమెను సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. అయితే త్రిష ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అంగీకరించారా? ఆమెనే జయలలిత పాత్రలో ఖరారు చేశారా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
జయలలిత జీవితం ఎన్నో మలుపులతో సాగింది. బాలనటిగా, ఆ తర్వాత అగ్ర కథానాయికగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆమె.. ఎంజీఆర్‌తో కలిసి పనిచేసిన సమయంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టి, పలుమార్లు ముఖ్యమంత్రిగా తమిళనాడుకు సేవలందించారు. ఆమె వ్యక్తిత్వం, రాజకీయ పోరాటం, ప్రజల్లో ఉన్న ఆదరణ కారణంగా జయలలిత జీవితం వెండితెరపై చూపించడం దర్శకులకు పెద్ద సవాలనే చెప్పాలి. ఇలాంటి కీలకమైన పాత్రలో త్రిష నటిస్తే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం కొనసాగిస్తున్న త్రిషకు నటిగా మంచి గుర్తింపు ఉంది. జయలలిత పాత్రలో ఆమె ఎలా కనిపిస్తారు? ఆ పాత్రకు అవసరమైన హావభావాలు, గంభీరమైన వ్యక్తిత్వాన్ని ఎంతవరకు తెరపై ఆవిష్కరిస్తారు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- elections
- jayalalitha
- lawrence
- MGR
RELATED ARTICLES
తాజా వార్తలు
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
Glacial Lake Outburst | భూటాన్‌లో హిమానీనదం విస్ఫోటనం.. బెంగాల్, అస్సాంలకు వరద ముప్పు.. కేంద్రం హైఅలర్ట్..!
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

