జయలలిత పాత్రలో త్రిష?
తమిళ సినీ, రాజకీయరంగాల్లో చెరగని ముద్ర వేసిన ఎంజీఆర్ జీవితం ఆధారంగా ‘పురట్చి తలైవర్' పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది.
తమిళ సినీ, రాజకీయరంగాల్లో చెరగని ముద్ర వేసిన ఎంజీఆర్ జీవితం ఆధారంగా ‘పురట్చి తలైవర్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. నటుడు జె.ఎం.బషీర్ ఇందులో ఎంజీఆర్ పాత్రను పోషించనున్నారు. ఈ బయోపిక్‌లో జయలలిత పాత్ర కోసం త్రిషను సంప్రదిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి
ఇటీవలే మీడియాతో మాట్లాడిన జె.ఎం.బషీర్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
త్రిష తన కుమార్తె స్నేహితురాలని, జయలలిత పాత్ర కోసం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు త్రిష అంగీకరించిందా? లేదా? అనే విషయంలో స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక నటుల ఎంపిక జరుగతున్నదని మేకర్స్ తెలిపారు. జయలలిత పాత్రలో నటించేందుకు త్రిష అంగీకరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

