తెలంగాణ మట్టి వాసన గుబాళించే కథతో..
అగ్ర నిర్మాత దిల్ రాజు.. తన తమ్ముడు శిరీష్ కుమారుడైన ఆశిష్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఓ కొత్త కుర్రాడు దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతున్నదని తెలుస్తున్నది.
అగ్ర నిర్మాత దిల్ రాజు.. తన తమ్ముడు శిరీష్ కుమారుడైన ఆశిష్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఓ కొత్త కుర్రాడు దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతున్నదని తెలుస్తున్నది. ఇప్పటివరకూ ఆశిష్ నటించిన రౌడీ బాయ్స్, లవ్ మీ చిత్రాలకు భిన్నంగా పూర్తి తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా ఉంటుందని విశ్వసనీయ సమాచారం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల మేళవింపైన కథతో రూపొందనున్న ఈ సినిమాలో.. విలేజ్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, వైలెన్స్.. అన్నీ కంటెంట్‌కి తగ్గట్టుగా ఉంటాయని, ఆశిష్ కేరక్టర్ కూడా ఊరమాస్‌గా డిజైన్ చేయడం జరిగిందని తెలుస్తున్నది. మరో విషయం ఏంటంటే.. బతుకమ్మ పండుగ ఈ కథలో కీలకమట. మొత్తంగా తెలంగాణ మట్టివాసన గుబాళించే కథతో ఈ సినిమా రూపొందనున్నదని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

