టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. యువ నటుడు సుధీర్ వర్మ (Sudheer Varma) బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న సుధీర్ వర్మ వైజాగ్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. సెకండ్ హ్యాండ్, కుందనపు బొమ్మ (Kundanapu Bomma) చిత్రాల్లో నటించాడు సుధీర్ వర్మ. కుందనపు బొమ్మ సినిమాలో సుధాకర్ కోమాకులతో కలిసి వన్ ఆఫ్ ది లీడ్ యాక్టర్‌గా నటించాడు.
సుధీర్ వర్మ ఆకస్మిక మృతి పట్ల సుధాకర్ కోమాకులతోపాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. సుధీర్ వర్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థించారు. సుధీర్ వర్మ అంత్యక్రియలు ఇవాళ లేదా రేపు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.