బుధవారం 02 డిసెంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 20:57:53

సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్ర‌భాస్ రూ.కోటి విరాళం

సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్ర‌భాస్ రూ.కోటి విరాళం

గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ లో చాలా  కాల‌నీలు జ‌ల‌దిగ్భంధంలో చిక్కుకున్నాయి. కుండ‌బోత వ‌ర్షాల‌తో నిరాశ్ర‌యులైన వారిని ఆదుకునేందుకు త‌మ వంతుగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ వివిధ రంగాల ప్ర‌ముఖుల‌ను కోరిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు తెలంగాణలో వరద నష్టానికి సాయంగా రెబల్ స్టార్ ప్రభాస్ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. 

తెలంగాణ లో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సహాయార్ధం  ప్రభాస్ తెలంగాణ సీఎం సహయనిధి కి తన వంతు సాయంగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.