మాస్ కా దాస్ మాసీ టైటిల్ వీడియో సాంగ్ విడుదల

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ విభిన్న కథా చిత్రాలు చేస్తున్నాడు. యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విశ్వక్ సేన్ ఈసారి లవర్‌బాయ్‌గా మారి ‘పాగల్’ అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆగస్ట్ 14న ఈ చిత్రంతో థియేటర్స్‌లోకి రాబోతున్నాడు. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు.
ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా వీడియో సాంగ్ విడుదల చేశారు. మాసీ టైటిల్ వీడియో సాంగ్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
పాగల్ సినిమాకు నరేశ్కుప్పిలి దర్శకత్వం వహించారు. విశ్వక్ సరసన నివేద పేతురాజ్ సందడి చేయనుంది. సిమ్రన్ చౌదరి, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ, మేఘాలేఖ, ఇంద్రజ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. రధన్ సంగీతం అందించారు. దిల్‌రాజు సమర్పణలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్ పతాకాలపై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అద్భుతమైన ప్రేమ కథగా చిత్రం ప్రేక్షకులని మెప్పిస్తుందని అంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- paagal
- Vishwak sen
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

