Theatre | సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియో మాత్రం ప్రేక్షకులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేస్తోంది. సినిమా థియేటర్లో ప్రదర్శితమవుతున్న సినిమా సన్నివేశానికి అనుగుణంగా నిజంగానే ఓ కారు స్క్రీన్‌ను చీల్చుకుని ప్రేక్షకుల మధ్యకు వచ్చినట్లుగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, థియేటర్లో ప్రేక్షకులు సినిమా చూస్తూ కూర్చున్నారు. ఆ సమయంలో స్క్రీన్‌పై రోడ్డుపై వేగంగా వస్తున్న కారు సన్నివేశం ప్రదర్శితమవుతోంది. మొదట అది సినిమాలోని సాధారణ సీన్లా కనిపించినప్పటికీ, కొద్ది క్షణాల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.
సినిమాలో కనిపించిన కారు ప్రేక్షకుల వైపు వస్తున్నట్లే, అదే సమయంలో ఓ మహీంద్రా స్కార్పియో ఎస్యూవీ స్క్రీన్‌ను చీల్చుకుంటూ థియేటర్లోకి దూసుకొచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో అక్కడ ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కొందరు తమ సీట్ల నుంచి లేచి పరుగులు తీయగా, మరికొందరు షాక్‌తో ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడే ఉండిపోయారు. ఈ వీడియో నిజంగా జరిగిన ఘటనకు సంబంధించినదా, లేక అత్యాధునిక ఎడిటింగ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించబడిందా అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేదు. అయితే వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం చాలా సహజంగా ఉండటంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.
వీడియోపై నెటిజన్లు కూడా ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. “ఇది నిజ జీవిత క్లైమాక్స్ సీన్లా ఉంది”, “4డీ సినిమా అనుభవానికి ఇది మరో స్థాయి”, “ఇంత రియలిస్టిక్ యాక్షన్ సీన్ ఎప్పుడూ చూడలేదు” అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం వీడియో నిజానిజాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వివిధ సోషల్ మీడియా వేదికల్లో లక్షలాది వ్యూస్ సాధిస్తూ వైరల్‌గా మారింది. అయితే వీడియో వెనుక అసలు కథ ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. నిజమా? ఫేక్‌నా? అనే ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఈ వీడియోపై చర్చ కొనసాగుతూనే ఉండేలా కనిపిస్తోంది.
कमाल है सिनेमा हॉल में अचानक घुसी महिंद्रा स्कार्पियो यह देख कर चीख पुकार मच गई।
ऐसा तो पहले कभी नहीं देखा। pic.twitter.com/gmSjuTN03x
— 𝗠𝗮𝗿𝗶𝘆𝗮𝗺_𝗠𝗕𝗗 (@Mariyam_MBD) May 29, 2026