ఈసారి మరింత నవ్విస్తాను
‘నాన్నగారు తీసిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రానికి, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. అది జీవితంలో సెటిల్ కాకుండానే పెళ్లి చేసుకునే వాడి కథ అయితే, ఇది సెటిల్ అయ్యాక కూడా పెళ్లికాని వాడి కథ. నా బలం కామెడీ. మంచి కంటెంట్ ఉన్న కామెడీ చిత్రమిది.
‘నాన్నగారు తీసిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రానికి, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. అది జీవితంలో సెటిల్ కాకుండానే పెళ్లి చేసుకునే వాడి కథ అయితే, ఇది సెటిల్ అయ్యాక కూడా పెళ్లికాని వాడి కథ. నా బలం కామెడీ. మంచి కంటెంట్ ఉన్న కామెడీ చిత్రమిది. ఈసారి ప్రేక్షకుల్ని మరింతగా నవ్వించాలనే ఈ సినిమా చేశా’ అన్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకుడు. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్నది. రాజీవ్ చిలక నిర్మాత. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు.
జ్యోతిష్యం నేపథ్యంలో టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. ఫలానా తేదీలోపు పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోతావని జ్యోతిష్కుడు హీరోతో చెప్పడం, ఈ క్రమంలో పండే వినోదం…చివరగా హీరో పెళ్లి ప్రపోజల్ పెట్టగానే హీరోయిన్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని చెప్పడం నవ్వుల్ని పంచింది. ఈవీవీ సత్యనారాయణగారి టైటిల్ తీసుకున్నాం కాబట్టి ఎంతో బాధ్యతగా సినిమా తీశామని, అల్లరి నరేష్ ఈ కథను మరో స్థాయికి తీసుకెళ్లారని నిర్మాత రాజీవ్ చిలక తెలిపారు. టీజర్ మాదిరిగానే సినిమా ఆసాంతం కడుపుబ్బా నవ్విస్తుందని దర్శకుడు మల్లి అంకం పేర్కొన్నారు. వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సూర్య, సంగీతం: గోపీసుందర్, దర్శకత్వం: మల్లి అంకం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

