బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్రాజ్పుత్ ఆత్మహత్య ఉదంతం యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి విచారణను ఎదుర్కొంది. ఈ క్రమంలో ఆమె కొంతకాలం పాటు జైలు జీవితాన్ని గడిపి బెయిల్పై బయటికొచ్చింది. సుశాంత్ ఆత్మహత్య విషయంలో రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదని నిర్ధారణ జరిగినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం ఆమెపై వ్యతిరేకత పోవడం లేదు.
ఇదే విషయం గురించి రియాచక్రవర్తి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘గతంలో మాదిరిగా సోషల్మీడియాలో నాపై ట్రోల్స్ రావడం లేదు. చాలా వరకు తగ్గాయి. కానీ ఇండస్ట్రీలో మాత్రం అందరూ అనుమానంగా చూస్తున్నారు. సినిమా అవకాశాలు ఇవ్వడానికి భయపడుతున్నారు. త్వరలో నిజానిజాలేమిటో తెలుసుకుంటారని భావిస్తున్నా’ అని చెప్పింది.