వైష్ణవ్‌తేజ్, కేతికాశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’.గిరీశాయ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టైటిల్ టీజర్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే హంగులతో టీజర్‌ను తీర్చిదిద్దారు. నాయకానాయికల మధ్య నడిచే బటర్‌ఫ్లై కిస్ థియరీ కొత్తగా అనిపిస్తున్నది. ‘ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రమిది. ఆద్యంతం హృదయాల్ని స్పశించే భావోద్వేగాలతో సాగుతుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ‘అర్జున్‌రెడ్డి ’ తమిళ వెర్షన్ డైరెక్ట్ చేసిన గిరీశాయ ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నారు. ప్రేమకథా చిత్రాల్లో ప్రేక్షకులకు ఓ నవ్యానుభూతిని అందిస్తుంది’అని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు.