The Raja Saab | 4 రోజుల్లో రూ. 201 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద ‘ది రాజా సాబ్’ జోరు
The Raja Saab | పాన్ ఇండియా నటుడు ప్రభాస్ నటించిన లేటెస్ట్ హారర్-కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది.
The Raja Saab | పాన్ ఇండియా నటుడు ప్రభాస్ నటించిన లేటెస్ట్ హారర్-కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. మారుతి దర్శకత్వంలో జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ కలెక్షన్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. తాజాగా ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్లో అధికారికంగా అడుగుపెట్టింది.
విడుదలైన మొదటి రోజే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ప్రభాస్, తాజాగా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 201 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నారు. సోమవారం వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ ఓవరాల్‌గా సినిమా ఇంకా నిలకడగా కొనసాగుతోంది. సినిమాపై విమర్శకుల నుంచి, సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రభాస్ క్రేజ్ ముందు అవేవీ నిలవడం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభాస్ వింటేజ్ కామెడీ టైమింగ్, డ్యాన్స్ మరియు మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి.
ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ మేరకు, చిత్ర బృందం ఇటీవలే ప్రభాస్ ‘ఓల్డ్ అవతార్’కు సంబంధించిన సుమారు 11 నిమిషాల నిడివి గల కొత్త సన్నివేశాలను సినిమాకు జత చేసింది. ఈ మార్పు తర్వాత థియేటర్లలో రెస్పాన్స్ మరింత పెరిగిందని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఇప్పుడు మరింత ఎంటర్టైనింగ్గా ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
A celebration that keeps growing.
A BLOCKBUSTER that stands tall 💪🏼#TheRajaSaab strikes 𝟐𝟎𝟏 𝐂𝐫+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 in 4 days ❤️🔥Celebrate #BlockbusterTheRajaSaab with your dear ones at cinemas near you 🫶🏻#Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy… pic.twitter.com/gbNbhIyRq4
— Vamsi Kaka (@vamsikaka) January 13, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

