నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిస్తున్న హైదరాబాద్ నేపథ్య పీరియాడిక్ చిత్రం ‘ది ప్యారడైజ్’ ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ముఖ్యంగా ‘ఆయా షేర్’ అనే పాట ఛార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 101 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
సినిమా విడుదలకు ముందే 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న నాని తొలి పాట ఇదని మేకర్స్ తెలిపారు. అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మ్యూజిక్, నాని ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు తిరుగులేని క్రేజ్‌ని తీసుకొచ్చాయని, నాని స్టెప్స్‌ని సోషల్‌మీడియాలో చాలా మంది రీక్రియేట్ చేస్తున్నారని చిత్రబృందం పేర్కొన్నది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.