గర్వంగా చెప్పుకొనే సినిమా

‘కథే ఈ సినిమాకు అసలైన హీరో. గొప్ప తెలుగు సినిమా ఇదని అన్ని భాషల వారు గర్వంగా చెప్పుకొనేలా ఉంటుంది’ అని అన్నారు శర్వానంద్. సిద్ధార్థ్‌తో కలిసి ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మహాసముద్రం’. అజయ్‌భూపతి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. అదితీరావ్‌హైదరీ, అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలు. ఈ నెల 14న విడుదలకానుంది. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ ‘దర్శకుడు చెప్పిన కథ వినగానే ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఒక్క మార్పు లేకుండా అంగీకరించా. తొమ్మిది మంది జీవితాలతో ముడిపడి సాగే ప్రేమకథా చిత్రమిది’ అని తెలిపారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాతో శర్వానంద్ రూపంలో మంచి స్నేహితుడు దొరికాడు. తెలుగు ప్రేక్షకులకు నాకు మధ్య ఏర్పడిన వెలితిని ఈ సినిమా పూరిస్తుంది’ అని చెప్పారు. అజయ్‌భూపతి ఎంతో ప్రేమించి చేసిన చిత్రమిదని నిర్మాత అనిల్ సుంకర పేర్కొన్నారు. ‘భావోద్వేగాలతో ముడిపడిన ప్రేమకథ ఇది. ఒకరి జీవితాలను మరొకరు ఎలా ప్రభావితం చేశారన్నది ఆకట్టుకుంటుంది. ఇమేజ్‌లు కాకుండా తెరపై పాత్రలు మాత్రమే కనిపిస్తాయి’ అని దర్శకుడు అజయ్‌భూపతి అన్నారు. ఇందులో తాను మహా అనే పాత్రను పోషించానని అదితీరావ్ హైదరీ చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Pneumonia | న్యుమోనియా అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ENE Repeat | బాక్సాఫీస్ వద్ద ‘ఈఎన్ఈ రిపీట్’ దూకుడు.. తొలి రోజే రూ.15 కోట్ల వసూళ్లు!
Vemula Prashanth Reddy | రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగా ఉందో లేదో అర్థం కావడం లేదు : వేముల ప్రశాంత్ రెడ్డి
Cyclone Akvan | తీరం దాటిన తుపాను అక్వాన్.. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు భారీ వర్ష సూచన
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

