Vyjayanthi Movies | ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు, లెజెండరీ సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో మళ్ళీ మెగాఫోన్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సుమారు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న 61వ సినిమా జనవరి 31న పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ‘కల్కి 2898 AD’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో “సెంచరీలు కొట్టే వయసు మాది” అంటూ సింగీతం గారు ఎంతో ఉత్సాహంగా కనిపించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2013లో వచ్చిన ‘వెల్కమ్ ఒబామా’ తర్వాత ఆయన చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్.ఎస్. రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులు కూడా ఈ ప్రాజెక్టుపై స్పందిస్తూ సింగీతం గారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా సినిమాపై ఆయనకు ఉన్న మక్కువను చూసి సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
A visionary. A master.
A genius ahead of time.The legendary Director #SingeetamSrinivasaRao garu returns with his most ambitious project yet.#SSR61 – Title Announcement Soon.https://t.co/SA22M5fcyx@nagashwin7 @ThisIsDSP @VyjayanthiFilms @SwapnaCinema pic.twitter.com/aX5Qi7X56i
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 31, 2026