హంపిలో మొదలైన ‘ది ఇండియా హౌస్’
అగ్ర హీరో రామ్‌చరణ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ‘ది ఇండియా హౌస్' కర్ణాటకలోని హంపిలో ఘనంగా ప్రారంభమైంది. వీ మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
అగ్ర హీరో రామ్‌చరణ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ‘ది ఇండియా హౌస్’ కర్ణాటకలోని హంపిలో ఘనంగా ప్రారంభమైంది. వీ మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. రామ్వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. హంపిలోని విరూపాక్ష దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు.
నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుందని, 1905 బ్యాక్‌డ్రాప్‌లో లవ్, రెవల్యూషనరీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, పీరియాడిక్ డ్రామాగా ప్రేక్షకులను మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: కామెరాన్ బైసన్, ప్రొడక్షన్ డిజైనర్: రజిని, సహనిర్మాత: మయాంక్, రచన-దర్శకత్వం: రామ్ వంశీకృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

