మదనపల్లెలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’. రామ్‌కార్తీక్, హెబ్బా పటేల్, నరేష్ వీకే, పవిత్రా లోకేష్, జయప్రకాష్ కీలక పాత్రల్లో నటించారు. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో విప్లవ్ కోనేటి రూపొందించారు. ఈ నెల 6 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సినిమా ఆద్యంతం అనూహ్య మలుపులతో ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నదని, ఇప్పటివరకు రాని జోనర్లో తీశామని దర్శకుడు తెలిపారు.
నటిగా తనకు కొత్త అనుభూతినిచ్చిన చిత్రమిదని హెబ్బా పటేల్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాణ సంస్థ: సిరంజ్ సినిమా, కెఎస్వీ ప్రజెంట్స్, స్క్రీన్‌ప్లే, రచన, నిర్మాత, దర్శకత్వం: విప్లవ్ కోనేటి.