కనిక,ఆమని, రవివర్మ, జ్యోతిరెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హర ఓం హర’. షేర్ దర్శకుడు. దేవేంద్ర మదన్‌సింగ్ నేగి, అశోక్ ఖుల్లార్ నిర్మాతలు.
ఈ చిత్రం టైటిల్ లోగోను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. హీరో సుమన్‌తో పాటు టీఎఫ్‌సీసీ ఛైర్మన్ ఆర్.కె.గౌడ్, గురురాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.