అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిషన్: చాప్టర్ 1’. ఎమీ జాక్సన్ కథానాయిక. విజయ్ దర్శకుడు. ఎం.రాజశేఖర్.ఎస్.స్వాతి నిర్మాతలు. ఈ చిత్రాన్ని ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ మా చిత్రాన్ని లైకా సంస్థ విడుదల చేయడం సంతోషంగా వుంది.
విలక్షణమైన సినిమాలను తెరకెక్కించే ప్రతిభ వున్న దర్శకుడు విజయ్ అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం 70 రోజుల్లోనే ‘మిషన్ చాప్టర్ 1’ చిత్రాన్ని తెరకెక్కించారు. లండన్, చెన్నయ్ సహా పలు లొకేషన్స్‌లో శరవేగంగా చిత్రీకరణ జరిపాం.
ఎమీ జాక్సన్ ఈ చిత్రంలో జైలును సంరక్షించే ఆఫీసర్‌గా కీలక పాత్రను పోషిస్తున్నారు. మలయాళ నటి నిమిషా సజయన్ మరో ముఖ్యపాత్రలో కనిపించబోతుంది.యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి.జీవీ ప్రకాష్ సంగీతం చిత్రానికి మెయిన్ హైలైట్‌గా వుంటుంది’ అన్నారు.