‘జనతాబార్’లో ఏం జరిగింది?
రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘జనతాబార్'. రమణ మొగిలి దర్శకుడు. అశ్వర్థ నారాయణ సమర్పణలో రోచి శ్రీ మూవీస్ పతాకంపై రమణ మొగిలి, తిరుపతి రెడ్డి బీరం ఈ చిత్రాన్ని నిర్మి స్తున్నారు.
రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘జనతాబార్’. రమణ మొగిలి దర్శకుడు. అశ్వర్థ నారాయణ సమర్పణలో రోచి శ్రీ మూవీస్ పతాకంపై రమణ మొగిలి, తిరుపతి రెడ్డి బీరం ఈ చిత్రాన్ని నిర్మి స్తున్నారు. ప్రస్తుతం నిర్మా ణానంతర పనులు జరుపు కుంటోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు పరశురామ్ విడుదల చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కమర్షియల్ విలువలతో పాటు ఓ బర్నిం గ్ ఇష్యూను డీల్ చేస్తూ రూపొందించిన ఈ చిత్రం విజయవంతం కావాలి. టైటిల్ కూడా క్యాచీగా వుంది.
దర్శకుడు రమణ మొగిలికి ఈ చిత్రం మంచి పేరును తీసుకరావాలి’ అన్నారు. దర్శక నిర్మాత రమణ మొగిలి మాట్లాడుతూ ‘రాయ్‌లక్ష్మీ కెరీర్లోనే ఇదొక డిఫరెంట్ చిత్రం. ఆమె పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న సెక్సువల్ హారాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది.
పూర్తి కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి చక్కని సందేశాన్ని జోడించి రూపొందించిన సినిమా ఇది. దర్శకుడు పరశురామ్ చేతుల మీదుగా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల కావడం శుభసూచకంగా భావిస్తున్నాం. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. తప్పకుండా చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. శక్తికపూర్, ప్రదీప్‌రావత్, అనూప్‌సోని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యజమాన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సిరాజ్, రచన: రాజేంద్ర భరద్వాజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

