Thaman S | థమన్ నుంచి ఒకేసారి బ్రో, గుంటూరు కారం అప్డేట్స్
Thaman S | మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రాల జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాలు బ్రో (Bro The Avatar), గుంటూరు కారం (Guntur Kaaram). ఇటీవలే త్రివిక్రమ్ టీం లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ మహేశ్ బాబు అభిమానులకు కావాల్సిన ఫుల్ ట్రీట్ అందిస్తోంది.
Thaman S | మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రాల్లో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాలున్నాయి. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాలు బ్రో (Bro The Avatar). పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. మరోవైపు మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న మూవీ గుంటూరు కారం (Guntur Kaaram). త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే త్రివిక్రమ్ టీం లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ మహేశ్ బాబు అభిమానులకు కావాల్సిన ఫుల్ ట్రీట్ అందిస్తోంది.
ఈ రెండు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్.. ఎస్ థమన్ (Thaman S) మ్యూజిక్ డైరెక్టర్. ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమా ఏదైనా.. హీరో ఎవరైనా.. వాయించడం మొదలుపెట్టాడంటే.. బాక్సాఫీస్ బద్దలవడం గ్యారంటీ అని ప్రత్యేకించి చెప్పనవరం లేదు. తాజాగా ఈ రెండు సినిమాల మ్యూజిక్ ఎలా ఉండబోతుందో చెప్పాడు ఎస్ థమన్. మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో ఎస్ థమన్ మాట్లాడుతూ.. బ్రో సినిమా కోసం టైం (సమయం) గురించి ఓ మ్యూజికల్ ప్రమోషనల్ సాంగ్‌ను రెడీ చేసినట్టు చెప్పాడు. ఈ సాంగ్ సినిమా ఎండింగ్లో వస్తుందని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఈ పాటను ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సస్పెన్స్‌లో పెట్టాడు థమన్.
మరోవైపు గుంటూరు కారం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ పనులు కొనసాగుతున్నాయని, అవుట్‌పుట్ ఇంప్రెసివ్‌గా వచ్చిందన్నాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేసేలా కంప్లీట్ ప్యాకేజీలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ఉండబోతుందని చెప్పి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. గుంటూరు కారం చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఇప్పటికే బ్రో నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ మై డియర్ మార్కండేయ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సముద్రఖని (Samuthirakani) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. బ్రో ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు పెంచేస్తున్నాయి.
ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తున్నారు. జులై 28న థియేటర్లలో సందడి చేయనుంది.
Music Sensation & National Award Winner #Thaman @MusicThaman Starts To Interact With Media #BroTheAvatar @PawanKalyan @IamSaiDharamTej pic.twitter.com/4yduMrJ9pl
— BA Raju’s Team (@baraju_SuperHit) July 10, 2023
బ్రో టీజర్..
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

