‘తెలంగాణ ఫిలింఛాంబర్ స్థాపించిన తొలినాళ్లలో ఎన్నో అవహేళనల్ని ఎదుర్కొన్నా. ఇందులో ఎవరు చేరుతారని అన్నారు. నేడు ఈ ఛాంబర్లో ఎనిమిదివేలకుపైగా సినీ కార్మికులతో పాటు పన్నెండు వందల మంది నిర్మాతలు, నటీనటులు సభ్యులుగా చేరడం ఆనందంగా ఉంది’ అని అన్నారు ప్రతాని రామకృష్ణగౌడ్. టీఎఫ్‌సీసీ ఎన్నికలు నవంబర్ 14న జరుగనున్నాయి. శనివారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘టీఎఫ్‌సీసీ ప్రారంభమై ఏడేళ్లు అవుతున్నది. ఈ అసోసియేషన్ ద్వారా కరోనా కష్టకాలంలో ఇరవై వేల మందిని ఆదుకున్నాం. టీఎఫ్‌సీసీ ఎన్నికల్లో ఎవరైనా పోటీచేయవచ్చు. అదే రోజున తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్ని నిర్వహించబోతున్నాం’ అని పేర్కొన్నారు.