SS Rajamouli | గ్లోబల్ వేదికపై ‘బాహుబలి’ యానిమేషన్ చిత్రం.. ఫ్రాన్స్ ‘అన్నెసీ 2026’లో రాజమౌళి టీమ్ సందడి!
SSRajamouli | దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’ లో సందడి చేస్తున్నారు.
Annecy 2026 | దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’ లో సందడి చేస్తున్నారు. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న భారీ యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ఈ ఫెస్టివల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగానికి ఎంపికైంది. గతంలో ఆస్కార్ గెలుచుకున్న Spider-Man: Into the Spider-Verse, Flow వంటి ప్రపంచ ప్రసిద్ధ యానిమేషన్ చిత్రాలు కూడా విడుదలకు ముందు ఈ కేటగిరీలోనే ప్రదర్శితమయ్యాయి. అయితే ఈ WIP సెషన్స్‌లో పాల్గొన్న రాజమౌళి టీమ్ ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక అప్డేట్స్ను అంతర్జాతీయ ప్రతినిధులకు అందించినట్లు తెలుస్తుంది.
అంతేకాకుండా ఈ ఫెస్టివల్లో గ్లోబల్ సెన్సేషన్ ‘ఆర్ఆర్’ చిత్రానికి ప్రత్యేక స్క్రీనింగ్‌ను కూడా నిర్వహించారు. ‘ఆర్ఆర్’ స్క్రీనింగ్‌కు విదేశీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా యానిమేషన్, సినిమా ప్రియులను ఆకర్షించే అన్నెసీ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు సినిమా సత్తాను రాజమౌళి టీమ్ మరోసారి చాటింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ‘బాన్జోర్ అన్నెసీ’ (Hello Annecy) అని బాహుబలి టీమ్ రాసుకోచ్చింది.
Bonjour, Annecy! 📍🇫🇷@ssrajamouli, @Shobu_ and @ssk1122 at #Annecy2026 for #BaahubaliTheEternalWar WIP sessions and #RRR Screening! 🌎🔥 pic.twitter.com/YXPN1Ul9Nz
— Baahubali (@BaahubaliMovie) June 24, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

