‘హనుమాన్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు యువ హీరో తేజ సజ్జా. తాజాగా ఆయన రియాలిటీ షో హోస్ట్‌గా కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’ తెలుగు వెర్షన్‌కు ఆయన హోస్ట్‌గా పని చేస్తున్నారు.
ట్రైటర్స్ రియాలిటీ షో తనదైన ప్రత్యేక కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుందని, తెలుగులో కూడా అదే స్థాయి థ్రిల్‌ని పంచుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ రియాలిటీ షోను తేజ సజ్జా హోస్ట్ చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ శుక్రవారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించింది.