Vani Jayaram | వాణీ జయరాం మృతిపై అనుమానాలకు తెర.. ఆ గాయాలకు కారణం ఇదే..!
ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం(78) మృతిపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. ఆమె మృతిపై ఎలాంటి సందేహాలు లేవని చెన్నై పోలీసులు స్పష్టం చేశారు.
Vani Jayaram | ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం(78) మృతిపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. ఆమె మృతిపై ఎలాంటి సందేహాలు లేవని చెన్నై పోలీసులు స్పష్టం చేశారు. బెడ్రూంలో ఆమె కింద పడటంతో తలకు బలమైన గాయం తగలడం వల్లే ప్రాణం పోయిందని ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక ఇచ్చారని పోలీసులు తెలిపారు. వాణీ జయరాం నివసిస్తున్న అపార్ట్మెంట్ ప్రాంగణంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదని స్పష్టం చేశారు.
తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో వాణీ జయరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. ఆమె అంతిమ యాత్రలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెన్నై బీసెంట్ నగరులో ఉన్న విద్యుత్ దహన వాటికలో ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలను పూర్తిచేశారు. అంతకుమందు ఆమె పార్థివదేహానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

