కింగ్ సెట్లోకి ఎంటరైన టబు
అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున 100వ మైల్స్టోన్ ప్రాజెక్ట్ ‘కింగ్ 100’(వర్కింగ్ టైటిల్) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. రా.కార్తీక్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున 100వ మైల్స్టోన్ ప్రాజెక్ట్ ‘కింగ్ 100’(వర్కింగ్ టైటిల్) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. రా.కార్తీక్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని మరింత పెంచుతూ నటి టబు ఈ సినిమా షూట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె కీలక పాత్ర పోషిస్తున్న విషయం విదితమే.
ప్రస్తుతం ఆమెపై దర్శకుడు రా.కార్తీక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నాగ్, టబు కాంబినేషన్లో వచ్చిన నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే సినిమాలు ఏ స్థాయి విజయాలను అందుకున్నాయో తెలిసిందే. మళ్లీ ఈ జోడీ తెరపై కనిపించనుండటంతో ఈ సినిమాపై అభిమానులకు ఆసక్తి రెట్టింపయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

