Suriya 43 | ప్రస్తుతం పీరియాడిక్ సినిమా కంగువ (Kanguva)తో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya). సూర్య 42 (Suriya 42)గా వస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం కంగువ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు సూర్య. ఇదిలా ఉంటే సూర్య ఆకాశం నీ హద్దురా ఫేం డైరెక్టర్ సుధాకొంగర (Sudha Kongara)తో సూర్య 43 కూడా ప్రకటించాడని తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఈ చిత్రం గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో ఉండనుందని తాజా టాక్.
అంతేకాదు లేటెస్ట్గా ఇండస్ట్రీలో రౌండప్ చేస్తున్న వార్తల ప్రకారం సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో సూర్య 43 సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఏ భామ కనిపించబోతుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులెవరనే దానిపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనుంది సూర్య టీం. ఇదిలా ఉంటే కంగువలో బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ కంగువ నుంచి విడుదల చేసిన రషెస్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కంగువ ప్రపంచవ్యాప్తంగా 2డీ, 3డీ ఫార్మాట్లలో 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సూర్య ఇప్పటికే వెట్రిమారన్ దర్శకత్వంలో జల్లికట్టు నేపథ్యంలో వాడివాసల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సూర్య మరోవైపు అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్న సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో..
A Man with Power of Fire & a saga of a Mighty Valiant Hero.#Suriya42 Titled as #Kanguva In 10 Languages🔥
In Theatres Early 2024Title video 🔗: https://t.co/xRe9PUGAzP@KanguvaTheMovie @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @UV_Creations @kegvraja pic.twitter.com/0uWXDIMCTM
— Studio Green (@StudioGreen2) April 16, 2023