Sriranganeethulu Movie | ఆసక్తికరంగా సుహాస్ శ్రీరంగనీతులు ఫస్ట్‌లుక్ పోస్టర్
Sriranganeethulu Movie First Look Poster | షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోస్‌తో కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు వేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్. ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు.
Sriranganeethulu Movie First Look Poster | షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోస్‌తో కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు వేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్. ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు. కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇక ఇటీవలే రైటర్ పద్మభూషణ్‌తో థియేటర్ హిట్టును కొట్టేశాడు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో సుహాస్‌కు పది కోట్ల మార్కెట్ ఏర్పడింది. ఇక ప్రస్తుతం ఆయన చేతిలో మూడు, నాలుగు సినిమాలున్నాయి. అందులో శ్రీరంగనీతులు ఒకటి.
ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తిక్ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సుహాస్, కార్తిక్ రత్నంతో పాటు నటి రుహాని శర్మ ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే ట్రైంగిల్ లవ్‌స్టోరీ అని తెలుస్తుంది. రాధావి ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై వెంకటేశ్వర రావు బల్మూరి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

