Janaka Aithe Ganaka | పిల్లలు అంటే భయపడుతున్న సుహాస్.. ఇంట్రెస్టింగ్గా ‘జనక అయితే గనక’ టీజర్
Janaka Aithe Ganaka Teaser | టాలీవుడ్ కుర్ర హీరో సుహాస్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం, శ్రీరంగ నీతులు, అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాలను అందుకున్న ఈ యువ నటుడు ఇప్పుడు మళ్లీ ఒక కొత్త స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Janaka Aithe Ganaka Teaser | టాలీవుడ్ కుర్ర హీరో సుహాస్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం, శ్రీరంగ నీతులు, అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాలను అందుకున్న ఈ యువ నటుడు ఇప్పుడు మళ్లీ ఒక కొత్త స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుహాస్ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’(Janaka Aithe Ganaka). ఈ సినిమాకు సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తుండగా.. బలగం, లవ్మీ వంటి విభిన్న తరహా సినిమాల తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఆ ఒక్క డెసిషన్ నా లైఫ్‌ను మార్చేసింది. అంటూ టీజర్ మొదలైంది. నేను ఒకవేళ తండ్రిని అయితే నా వైఫ్‌ను సిటీలో ఉన్న బెస్ట్ ఆస్పత్రిలో చూపించాలి. నా పిల్లలను బెస్ట్ స్కూల్లో చదివించాలి, బెస్ట్ కాలేజిలో చదివించాలి. వాళ్లకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లలను కనకుడదు అంటూ టీజర్ సాగింది. ఇక టీజర్ చూస్తే.. ఎల్కేజీ, యూకేజీలకే లక్షలు వసూలు చేస్తున్న ఈ కాలంలో ఒక మిడిల్ క్లాస్ యువకుడు తనకు పిల్లలు పుడితే వారిని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సుహాస్‌తో పాటు, సంగీత్, వేన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

